తెలంగాణ సామ్నా: ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకుంటున్న వేళ రష్యా తన క్షిపణులతో, డ్రోన్లను ఉక్రెయిన్‌పై ప్రయోగించి నూతన సంవత్సరంలో తాము ఉక్రెయిన్‌తో ఎలా వుండబోతున్నామో ప్రపంచానికి చాటి చెప్పింది. దాదాపుగా 20 మిస్త్సెళ్లను, 40 వరకు డ్రోన్లతో రష్యా దాడి చేసిసట్లు సమాచారం. అయితే ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఉక్రెయిన్ తెలిపింది. అయితే ఆస్థినష్టం జరిగిందని తెలిపింది. రష్యా ప్రయోగించిన మిస్సెళ్లలో ఆరింటిని, డ్రోన్లలో 16ని కూల్చేశామని .మరో 24 డ్రోన్లు తమ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయని ఒక్కరికి గాయాలు అయ్యాయనిఉక్రెయిన్ తెలిపింది.
మరికొద్ది రోజుల్లో పదవి వీడనున్న అమెరికా అధ్యక్షుడు జోబైడన్ ఉక్రెయిన్‌కు భారీ మొత్తంలో సహయం ప్రకటించి రెండు రోజులు పూర్తి కాకముందే రష్యా ఉక్రెయిన్‌పై తన సహజసిద్ధ స్వభావంతో దాడికి తెగబడిరదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
