28 C
Hyderabad
Friday, July 31, 2026
No menu items!

ఇలా కూడా హత్య చేస్తారా?

తెలంగాణ సామ్నా బ్యూరో: ఓ వంద ఇంగ్లీష్‌, తెలుగు సినిమాలకు చెందిన క్రైమ్‌, థ్రిల్లర్‌, సస్పెన్స్‌, హర్రర్‌ కథలను ఓ మిక్చర్‌లో వేసి రుబ్బి రుబ్బి పిండిచేస్తే వచ్చిన ‘‘క్రీం’’తో సరికొత్తగా తయారుచేస్తే తయారు అయినట్టుగా వుంది ఈ హత్యా కథనం ‘‘మీర్‌పేట మాధవి మర్డర్‌’’.

ఇలా కూడా హత్య చేస్తారా? అని ఎంతో అనుభవం వున్న పోలీసు అధికారులు సైతం ముక్కుమీద వేలేసుకొని విస్తుపోయేలా హత్య చేసిన సదరు గురుమూర్తి రాక్షసత్వంను చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు అంటే అతిశయోక్తి కాదు. రక్తం చూస్తేనేకళ్లు తిరిగి పడిపోయేవారు కొందరు వుంటే భార్యను హత్యచేసి ముక్కలు ముక్కలు చేసి కుక్కర్‌లో ఉడకబెట్టి, ఎండబెట్టి, ఆ తరువాత పొడి చేసి తీరిగ్గా చెరువులో కలిపేసిన ఘనుడి రాక్షసత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే అనే అభిప్రాయం వస్తుంది.


సినిమాకు ముందు ట్రేలర్‌ వేస్తారన్నట్టుగా భార్యను హత్య చేయడానికి ముందు కుక్కను చంపి ట్రై చేశాడీ ప్రబుద్ధుడు. ఇంత వరకు ఇలాంటి రాక్షస సైకో హత్య ఎక్కడా జరగలేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.


ఈ అత్యంత రాక్షస మనస్తత్వం కలిగిన మహానుభావుడి పేరు గురుమూర్తి. ఆంధ్రాలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపి చెరువుకు చెందిన ఈ వ్యక్తి 13 సంవత్సరాల క్రితం అదే జిల్లాకు చెందిన వెంకట మాధవితో పెళ్లయ్యింది. ఇద్దరు సంతానం. ఆర్మీలో పనిచేసి రిటైరయిన తరువాత సెక్యూరిటి గార్డుగా పనికి కుదురుకున్నాడు. మీర్‌పేటలోని జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వర కాలనీలో కుటుంబంతో సహ వుంటున్నాడు.
అయితే కొంత కాలంగా గురుమూర్తి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీనితో ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. గొడవలు ముదరడంతో ఎలాగైనా భార్యను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈలోగా సంక్రాంతి సెలవులు వచ్చాయి. పండగ పేరు చెప్పి పిల్లలను, భార్యను సోదరి ఇంటికి వెళ్లాడు గురుమూర్తి. ఆ తరువాత పిల్లలను సోదరి ఇంట్లోనే వదిలి భార్యతో సహ ఇంటికి వచ్చాడు. అయితే 19వ తేదీన గురుమూర్తి మరో మహిళతో చనువుగా వున్న ఫోటో భార్య మొబైల్‌లో చూసింది. దీనితో అంతంత మాత్రంగా వున్న బంధం అమాంతంగా తెగిపోయింది. ఇద్దరి మద్యన గొడవ పెరిగి తీవ్రమయ్యింది. అప్పటికే ఎలాగైనా భార్యను హత్య చేయాలనే తీవ్రమైన ఆలోచనలో వున్న గురుమూర్తి భార్యను రోకలిబండతో తలపై బలంగా కొట్టి హతమార్చాడు. ఆ తరువాత గురుమూర్తి చేసిన నిర్వాకం ఎన్నో వందల హత్య కేసుల్ని పరిష్కరించిన పోలీసులను సైతం ఆశ్చర్యపరిచే విధంగా వుందంటే ఆతిశయోక్తి కాదు.
‘‘చికెన్‌ సెంటర్‌లో చికెన్‌ కొట్టినంత’’ సులభంగా శవాన్ని బాత్‌రూంకు తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా నరికాడు. స్నానానికి వేడి నీళ్లు పెట్టుకున్నట్టుగా నీటిని వేడి చేసి అందులో భార్యను ముక్కలు ముక్కలుగా నరికిన శరీర భాగాలను ఉడికించాడు. ఆ తరువాత మాంసాన్ని బొక్కల్ని వేరుచేసి బొక్కల్ని చూర్ణం చేశాడు. మెత్తటి శరీర భాగాల్ని పేస్ట్‌గా మార్చాడు. భార్యను చంపి శరీర భాగాల్ని ముక్కలు ముక్కలుగా చేసి నీటిలో మరగబెట్టి, ఆ భాగాల్ని తిరిగి మాంసాన్ని బొక్కల్ని వేరు చేసి, బొక్కల్ని చూర్ణం వేసి, మాంసాన్ని పేస్ట్‌ చేశాడు. ఇది గురుమూర్తి భార్య వెంకట మాధవిని ఒళ్లు గగ్గుర్పొడిచే విధంగా చంపిన తీరు.
ఆ తరువాత ‘‘పేస్ట్‌, చూర్ణాన్ని’’ తీసుకెళ్లి మీర్‌పేట చందా చెరువులో కొంత, మిగిలిన కొంత డ్రైనేజీలో కలిపేశాడు. ఆ తరువాత ఎలాంటి అనుమానం రాకుండా ఇల్లంగా శుభ్రంగా కడిగేశాడు. ఇదంతా చేయడానికి గరుమూర్తికి రెండు రోజుల సమయం పట్టింది.
ఆ తరువాత ఏం తెలియని అమాయకుడిలా భార్య తనతో గొడవ పడిరదని, కనిపించడం లేదని అత్తామామలకు సమాచారం ఇచ్చాడు. ఆ తరువాత మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కంప్లెంట్‌ ఇచ్చాడు. ఇంతవరకు అత్యంత తెలివిగా, రాక్షసంగా వ్యవహరించాడు. అయితే ఎప్పుడైతే పోలీసులు ఏంట్రీ ఇచ్చారో అపుడు మెల్లిమెల్లిగా గురుమూర్తి కదలికలపై అనుమానాలు వ్యక్తమవుతు వచ్చాయి.
వెంకట మాధవి ఇంటి నుండి ఒంటరిగా బయటకు వెళ్లడం అక్కడ వున్న సిసి కెమారాల్లో ఎక్కడా రికార్డు కాకపోవడంతో పోలీసులు ఈ కేసును మరింత లోతుగా పరిశీలించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే భార్య కనిపించకుండా పోయిన రెండు రోజుల తరువాత గురుమూర్తి ప్లాస్టిక్‌ సంచులతో బయటకు వెళ్లడం మళ్లీ సంచులు లేకుండా ఇంటికి రావడం సిసి కెమారాలో రికార్డు అయిన దృశ్యాలు చూసిన తరువాత గురుమూర్తి పోలీసులకు అనుమానం మొదలైంది. దీనితో గురుమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చెపట్టారు. తమదైన పద్ధతిలో గురుమూర్తిని విచారిస్తే జరిగింది జరిగినట్టు పోలీసులకు విన్నవించుకున్నాడు.

హత్య చేసినట్టుగా గురుమూర్తి ఒప్పుకున్నాడు. అంతట్‌ితో పోలీసుల పని పూర్తవ్వదు కదా! ఏలా హత్య చేశాడో కోర్టుకు చెప్పగలగాలి. ఏ ఆయుధంతో హత్య చేశాడో చెప్పగలగాలి. ఇంకా శవాన్ని పోస్ట్‌మార్టం లేదా చనిపోయినట్టుగా ఆధారాలు చూపించగలగాలి. అపుడే పోలీసులు హంతకునికి శిక్ష వేయించగలుగుతారు.
ఈ కేసులో గురుమూర్తి అసలు వెంకట మాధవి హత్యకు సంబంధించిన ఏ చిన్న ఆధారం దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. అందుకే చాలా ధైర్యంగా తానే హత్య చేశానని చెప్పుకొచ్చాడు. కాని భవిష్యత్తులో కోర్టుకు సమర్పించడానికి పోలీసుల వద్ధ సరిjైున అధారాలు లేవు. ఆ ధీమాతోనే గురుమూర్తి వున్నాడు. అందుకే ‘‘అవును హత్య చేశాను. ఏం చేసుకుంటారో చేసుకొండి’’ అనేంతగా అతని వ్యవహర శైలి కనబడడంతో పోలీసులు తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. వెంకటమాధవి శరీరాన్ని పేస్ట్‌ చేసిన అనవాళ్లు డ్రైనేజీలో దొరుకుతాయని పోలీసులు వెతికించినా లాభం కనబడలేదు. బొక్కల చూర్ణం చెరువులో దొరుకుతుందేమోనని వెతికినా ఫలితం శూన్యమే అయ్యింది. దీనితో పోలీసులకు మిస్టరీ విడిన ఈ కేసులో సాక్ష్యాల వెతుకులాట పెద్ధ సవాల్‌గా మారింది.
ఫోరెన్సిక్‌ నిపుణులతో ఇల్లు మొత్తం అధారాల కోసం వెతికే పనిలో పడ్డారు పోలీసులు. శరీర భాగాల్ని కాల్చినట్లు గర్తించారు. వెంకట మాధవి తల వెంట్రుకల్ని గుర్తించారు. మాధవి శరీర భాగాల్ని ముక్కలు ముక్కలుగా చేసిన కత్తిని, కుక్కర్‌ను, హీటర్‌ను, మొద్దును స్వాధీనం చేసుకున్నారు. అక్కడడక్కడ పడినట్లు కనిపిస్తున్న వెంకట మాధవి రక్తపు మరకలను గుర్తించి వాటిని గురుమూర్తి పిల్లల డిఎన్‌తో పోల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.
అత్యంత భయంకరమైన, క్రూరమైన హత్యలో గురుమూర్తి భార్యను చంపిన కేసు కూడా ఒకటిగా నిలిచిపోతుందని అంటున్నారు. హత్య చేయబడిన వెంకట మాధవి మృతదేహం దొరికే అనవాళ్లు అవకాశం లేవన్న ధీమాతో గురుమూర్తి తాను జైలులోనే వుంటాను బెయిల్‌
కూడా తీసుకోను అని అంటుండడం కొసమెరుపు. అయితే తానే వివాహేతర సంబంధం పెట్టుకొని ఆ నెపాన్ని భార్యమీదకు నెట్టి అత్యంత కిరాతకంగా హత్య చేసిన సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలన సంఘటనగా మారింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles