
తెలంగాణ సామ్న: అల్లు అర్జున్‌పై పోలీసులు పెట్టిన కేసు చాలా చిన్నదని బీజేపి ఎంపి, న్యాయవాది రఘనందన్రావ్ వ్యాఖ్యానించారు. తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఒకదాని వెనక మరోకటి పోలీసులు తప్పు చేస్తున్నారని ఆయన అన్నారు. భద్రతా వైపల్యాన్ని పక్కన బెట్టి హీరో అల్లు అర్జున్ మాత్రమే సాకుగా చూపుతోందని ఆయన పేర్కోన్నారు. అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టడానికి వీలులేనప్పుడు సిపి మాత్రం వీడియోలు ఎందుకు విడుదల చేస్తారని ఆయన ప్రశ్న వేశారు. ఈ కేసులోప్రభుత్వం ఉద్ధేశ్యపూర్వకంగా కక్ష సాధింపు దోరణితో వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు.
