28.6 C
Hyderabad
Sunday, June 21, 2026
No menu items!

అయ్యా అవ్వను పట్టించుకోని కొడుకుల్లారా… ఇక జాగ్రత్త

తెలంగాణ సామ్న: కన్న తల్లి తండ్రులను పట్టించుకోని కొడుకుల్లారా, ఇక మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం వు0డేత గొప్పగా సుప్రీంకోర్టు ఒక మంచి తీర్పునిచ్చింది. కోడలుకు మీరు వుండుడు ఇష్టం లేదు. దాని తోటి మిమ్మల్ని చూచుకునుడు కావడం లేదు. మా పని ఒత్తిడిలో మేమే వున్నం. మిమ్మల్ని ఎక్కడ పట్టించుకునేది అనే వాయిదాల మాటలు, పట్టించుకోని ధోరణిలు ఇక చెల్లు అయి అలాంటి కొడుకులకు అలియాస్‌ కోడలు చెప్పినట్లు అటలాడే కొడుకులకు చెంప చెల్లుమనిపించే తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది. వృద్ధాశ్రమాల్లో బ్రతుకీడుస్తూ తన వారి కోసం ఎదురుచూస్తూ కన్నీళ్ల పర్యంతం అయ్యే ముసలి భార్యభర్తలకు ఊరటనిచ్చే తీర్పు సుప్రీంకోర్టు వెలువరించింది.
వివరాల్లోకి వెళితే… తన ఆస్థి తీసుకున్న కుమారుడు ఇచ్చిన మాట ప్రకారం తనను పట్టించుకోవడం లేదని ఓ తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన తరువాత సుప్రీంకోర్టు ఒక ఆదర్శవంతమైన తీర్పు ఇచ్చింది. తల్లిదండ్రులను రక్షించడం లేదా కాపాడుకోవడం ఆర్థికపరమైన బాధ్యత మాత్రమే కాదు. అది ఒక సామాజిక, నైతిక బాధ్యత దానిని పూర్తి చేయడం సంతానం బాధ్యత అని కోర్టు వివరించింది.
తల్లిదండ్రుల ఆస్థి పొందే హక్కు వున్న కొడుకు(లు) వారిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా వుందని కోర్టు స్పష్టం చేసింది. అమ్మ నాన్నలను బాగా చూసుకుంటామని నమ్మబలికి వారి నుండి ఆస్థి పొంది ఆ తరువాత పట్టించుకోకుండా మాట తప్పడం ఏ కొడుకుకు బావ్యం కాదని చెప్పింది.
తల్లి వేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ రవికుమార్‌, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ ధర్మాసనం కేసు మొత్తాన్ని పరిశీలించి ఆ కొడుకు చేసుకున్న ‘‘గిఫ్ట్‌ డిడ్‌’’ను రద్దు చేసింది. ఆ తరువాత సదరు ఆస్థిపై తల్లిదండ్రుల హక్కులను తిరిగి ఇచ్చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యాలు చేసింది. 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం కన్నవారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారి సంతానంపై తొందరగా విచారణ జరుపుతామని పెర్కోంది.
అన్ని బంధాలు ఆర్థిక సంబంధాలుగా మారుతున్న ఈ కాలంలో వృద్ధులైన తల్లిదండ్రుల ఆస్థి తీసుకొని పట్టించుకోని సంతానానికి ఈ తీర్పు భవిష్యత్తులో కనువిప్పు కలిగిస్తుందన్న వ్యాఖ్యానాలు వస్తున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles