32 C
Hyderabad
Friday, October 30, 2026
No menu items!

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: కోరుట్ల సిఐ కే. తిరుపతి

(బాలే అజయ్, కోరుట్ల)

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ కొమ్ము తిరుపతి హెచ్చరించారు.
రాబోయే దసరా పండుగను పురస్కరించుకుని కోరుట్ల పట్టణ పరిధిలోని రౌడీ షీటర్లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఆయన ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కొమ్ము తిరుపతి మాట్లాడుతూ, పండుగల వేళ పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణం నెలకొల్పడమే పోలీసుల ప్రధాన కర్తవ్యమని స్పష్టం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు రౌడీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో నేర ప్రవర్తనను వీడి సాధారణ పౌరులుగా జీవించాలని ఆయన సూచించారు.
దసరా పండుగ సమయంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని ఆయన గట్టిగా హెచ్చరించారు.
చట్టవ్యతిరేక కార్యకలాపాలు, ఘర్షణలకు దిగితే ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రజలందరూ పండుగను ప్రశాంతంగా, ఉత్సాహంగా జరుపుకునేందుకు సహకరించాలని, పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎస్సై శ్యామ్ రాజ్ తో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles