32 C
Hyderabad
Friday, October 30, 2026
No menu items!

కోరుట్లలో బీజేపీ నాయకుడిపై కత్తితో దాడి, హత్యాప్రయత్నం!

(బాలే అజయ్ – 9290277727 | కోరుట్ల)

దుర్గాదేవి నిమజ్జనం సందర్భంగా మొదలైన చిన్న వివాదం.. ట్రాక్టర్ అలంకరణలు తొలగిస్తుండగా కత్తితో దాడి చేసేంత వరకు వెళ్ళింది.

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అర్బన్ కాలనీలో దేవి విగ్రహాల నిమజ్జనం సందర్భంగా మొదలైన చిన్న వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో బీజేపీ నాయకుడు గుద్దేటి రాజేందర్‌పై కత్తితో దాడి జరగడంతో ఆయన గాయపడ్డారు. ప్రాథమిక విచారణ అనంతరం చికిత్స కోసం ఆయనను కోరుట్ల ప్రభుత్వ సివిల్ ఆసుపత్రికి తరలించారు.

వివరాల్లోకి వెళితే.. దేవి విగ్రహాల నిమజ్జనం సందర్భంగా కొందరు యువకుల మధ్య గొడవ జరుగుతుండగా, కాలనికి చెందిన ఒక యువకుడు జోక్యం చేసుకుని వారిని వారించారు. మీ వయసెంత? మీరు చేస్తున్న పని ఏమిటి? అంటూ ప్రశ్నించి, మరోసారి గొడవలకు దిగవద్దని హితవు పలికారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పి వారిని పంపించారు.

అయితే, ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న సదరు యువకులు దేవి విగ్రహాల నిమజ్జనం ముగించుకుని తిరిగి వెళుతున్న సమయంలో లాఠీలతో ఎదురుచూస్తూ మరోసారి గొడవకు దిగారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న రాజేందర్ జోక్యం చేసుకుని వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ వయసులో మద్యం సేవించి గొడవలకు దిగితే మీ తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడతారో ఆలోచించాలని చెబుతూ, మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని నచ్చజెప్పి పంపించారు. కథ ఇంతటితో అయిపోయిందని అందరూ వెళ్ళిపోయారు.

అనంతరం నిమజ్జన కార్యక్రమం ముగించుకుని అర్బన్ కాలనీకి చేరుకుని రాజేందర్ మరియు కాలనీ యువకులు ట్రాక్టర్‌పై ఉన్న అలంకరణలను తొలగిస్తుండగా, అదే యువకులు కత్తితో అక్కడికి వచ్చి మరోసారి గొడవకు దిగారు. వివాదాన్ని ఆపేందుకు రాజేందర్ ప్రయత్నించినప్పటికీ, వారు వెనక్కి తగ్గకుండా కత్తితో రాజేందర్ పై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నం చేశారు.. అయితే వారిని స్థానికులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసు అధికారి ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఇద్దరు నిందితులను తన ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లారు. కత్తి దాడిలో గాయపడిన బీజేపీ నాయకుడు గుద్దేటి రాజేందర్‌ను చికిత్స నిమిత్తం కోరుట్ల ప్రభుత్వ సివిల్ ఆసుపత్రికి తరలించారు.

చిన్నపాటి వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించిన వ్యక్తిపైనే కత్తితో దాడి జరగడం అర్బన్ కాలనీలోనే కాకుండా పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles