
(బాలే అజయ్, కోరుట్ల)
మంగళవారం కోరుట్ల పట్టణంలో కోరుట్ల నియోజకవర్గ జనసేన వినాయక మండపం వద్ద అత్యంత వైభవోపేతంగా మహా అన్నప్రసాద వితరణ జరిగింది. అంతకు ముందు నిర్వాహకులు పంచలోహ విఘ్నేశ్వర విగ్రహానికి నిర్వాహకులు, భక్తులు పాలాభిషేకం నిర్వహించారు. తదుపరి అన్న ప్రసాద వితరణ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్లాస్టిక్ రహిత సమాజం పట్ల అవగాహన కల్పించదానికి స్టీల్ ప్లేట్స్, స్టీల్ గ్లాసెస్ లో అన్న ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల జనసేన పార్టీ సీనియర్ నాయకులు గుమ్లాపూర్ గ్రామ వార్డు మెంబర్ అడ్లగట్ట సురేష్, ఈశ్వర్ నగర్ ఉప సర్పంచ్, కోరుట్ల మండల ఉప సర్పంచ్ల ఫోరం ఉప అధ్యక్షుడు బసవెని రమేష్, వోడ్నాల రామారావు సౌజన్య మరియు యువ నాయకులు, సాధక్ లు, సాయి కృష్ణ, సురేష్, అభినవ్, సంజీవ్, శ్రీనివాస్, శశి, వీర మహిళలు కవిత, లహరి జగిత్యాల పట్టణ సాధక్ సతీష్, మెట్ పల్లి నుండి జిల్లా సీనియర్ నాయకులు ఆనంద్ గౌడ్, ఏలుగందుల అజయ్, మారుతి, సనత్ మల్లాపూర్ నుండి పెంబి మహేందర్, రాంప్రసాద్ మరియు ఆర్మూర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు చిరంజీవి, రాము లు పాల్గొన్నారు.

