
( తెలంగాణ సామ్నా – కథలాపూర్)
కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో అమావాస్య సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని పరమేశ్వరునికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక హారతుల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో నిండి పోయింది గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలను నిర్వహించి శివుని ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
