
(పిట్ట రాజేష్, కోరుట్ల)
మృగశిర కార్తె ( మిరుగు) పండుగ ఆదివారం వస్తున్న నేపథ్యంలో పట్టణంలోని చేపల మార్కెట్లో విపరీతమైన రద్దీ ఏర్పడింది.
మిరుగు రోజు చేపల కూర తినాలని ఆనవాయితీ ఉన్న నేపథ్యంలో చాలామంది మాంసాహారులు చేపల కూరను భుజించటానికి ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో ఆదివారం స్థానిక చేపల మార్కెట్లో విపరీతమైన రద్దీ ఏర్పడింది.
మొట్టలు, రవట్లు జెల్లలు, అనే తేడా లేకుండా అమ్మకాలు సాగాయి.
మిరుగు రోజు చేపలు తింటే అస్తమా లాంటి రోగాలు రావనే నమ్మకం ఉంది.
ఈరోజు చేపల ధరలు కూడా రెండింతలు అయినట్టుగా కొనుగోలుదారులు చెప్తున్నారు.
