(బాలే అజయ్ – 9290277727)
తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కోరుట్ల నియోజకవర్గ జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. రాష్ట్ర అధిష్టానం పిలుపు మేరకు వోడ్నాల రామారావు ఆధ్వర్యంలో కోరుట్ల ఆర్టీసీ డిపో ఎదుట జనసేన నాయకులు, కార్యకర్తలు కార్మికులకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నర్సంపేట డిపోకు చెందిన శంకర్ గౌడ్ ఆత్మహత్య ఘటన పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించి, వారి డిమాండ్లను ఎలాంటి షరతులు లేకుండా అంగీకరించాలని డిమాండ్ చేశారు. సమస్యను మరింత కాలం లాగితే రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ కార్మికులకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు సురేష్, అడ్లగట్ల మాసం విజయ్ కుమార్, కట్ట రంజిత్, కోటగిరి సంపత్, తుమ్మ సురేష్, దాసోహం అనిల్, వన తడుపుల సంజీవ్, చిలివేలు సాయి కృష్ణ, ప్రశాంత్, ఉషకుల శశి, రాజు, పులి అనిల్, చిలివేరి మణిదీప్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో జనసైనికులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
