(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
రాజేశ్వరరావు పేట గ్రామంలో ఈరోజు రాష్ట్ర వంజరి సంఘం క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా వంజరి సంఘ అధ్యక్షుడు బొమ్మల శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎక్స్ సర్పంచ్ నల్ల విట్టల్, ఎక్స్ సర్పంచ్ సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం మండల వంజరి సంఘ అధ్యక్షుడు నవోత్ రాజేందర్, లవంగ రాజశేఖర్, లక్ష్మీపతి, గ్రామ వంజరి సంఘ సభ్యులు బలరాం, పరమేశ్వర్, గోపాల్, లక్ష్మీరాజం, రాజేశ్వర్, తేజ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
