కోరుట్ల టౌన్(పి. రాజేష్, తెలంగాణ సామ్నా, 9398508383) జనవరి 26
కోరుట్ల పట్టణంలోని 3వ వార్డులోని మాదాపూర్ కాలనీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాదాపూర్ కాలనీలో ఎన్నం రాజశేఖర్ సౌజన్యం తో ఆక్వాట్స్ పాత్ లాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ( NABL Acridated Lab ) ఆధ్వర్యంలో ఉచిత రక్త పరీక్షలు నిర్వహించారు, దాదాపు 200 మంది పైగా కాలనీ వాసులకు ఉచితంగా రక్త పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో కాలనీ యూత్ సభ్యులు మరియు కాలనీ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా నిర్వాహకులు ఎన్నం రాజశేఖర్ మాట్లాడుతూ ఉచిత రక్త పరీక్షల శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు, ఏన్నం లావణ్య రాజశేఖర్ లావణ్య మాట్లాడుతూ ముఖ్యంగా మన మహిళ మణులు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్త పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నం ఎర్రయ్య, వాజిద్, శ్రీనివాస్, షకీర్, హాబీబ్, శేఖర్, మని, సతీష్, మహేష్, సుమన్,గణేష్, రాకేష్, లయ, శిరీష,హారిక, ల్యాబ్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
