పుష్ప2 ప్రీమియర్‌కు సంధ్య థియేటర్ వద్ద తాను రోడ్‌షో చేయలేదని అల్లు అర్జున్ అన్నారు. వేలాది మంది అభిమానులు తన కోసం ఎదురుచూస్తున్నారని తాను కారు బయటకు వచ్చి చేయి మాత్రమే చూపించానని ఆయన తెలిపారు. తాను కాసేపు
సినిమా చూసిన తరువాత వెళ్లిన తరువాత తనకు మరుసటిరోజు తొక్కిసలాట గురించి తెలిసిందని వివరించారు. రేవతి చనిపోయిందని తెలిసిన తరువాత తాను పరామార్శించడానికి వెళ్దామని అనుకున్నాను కాని పోలీసులు, సన్నిహితులు వద్దనడంతో వెళ్లలేదని తెలిపారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు చనిపోతే తాను పరమార్శించానని, అలాంటిది తన అభిమాని చనిపోతే, ఆరోగ్య పరిస్థితి విషమంగా వుంటే వెళ్లకుండా వుంటానా? అని అన్నారు. సిఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యాలు తనను బాధించాయని అన్నారు. తాను రోడ్‌షో చేశానని అనడ సరికాదని అన్నారు. అలాగే అనుమతి లేకుండా వెళ్లానని అనడం కూడా కరెక్ట్ కాదని అన్నారు. తాను ప్రభుత్వంతో ఎలాంటి వివాదం కోరుకోవడం లేదని అన్నారు.

