సిరిసిల్ల జిల్లా కేంద్రలోని బివై నగర్లో వివాదం చోటు చేసుకుంది. నక్క శ్రీనివాస్ (41) అనే నేత కార్మికుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. విషయం తెలిసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం ఒక నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకొగా శనివారం మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడంతో నేత పనివారిఆర్థిక పరిస్థితికి ఈ ఆత్మహత్యలు అద్ధం పడుతున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
