ఔరంగాబాద్ శివసేన యుబిటి సెంట్రల్ అభ్యర్థి కిషన్ చంద్ తన్వాని ఆ పార్టీకి తల దిమ్మెక్కి షాకిచ్చారు. యు బి టి అభ్యర్థి కిషన్ చందు తన్వాని గత వారం పది రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నానని ఎంబీఏ కూటమి ఎక్కడ గెలిచేలా లేదని ఆయన అన్నారు. తను పోటీ చేస్తే ఓడిపోవడం కచ్చితం అని అందుకే తనకు కేటాయించిన టికెట్టును పార్టీకి వాపస్ చేస్తున్నానని ఆయన అన్నారు. సీఎంగా ఉన్న ఏకనాథ్శిండే లడికి బహిన్ యోజన అమలు చేస్తున్న విధానం బాగుందంటూ ఆయనకు మద్దతు ప్రకటించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో మధ్యప్రదేశ్ రాజస్థాన్లో ఇలాంటి తరహా టికెట్ వాపసులు ఇవ్వడం జరిగింది. కాగా ప్రస్తుతం కిషన్ చంద్ తన్వాని తన కు కేటాయించిన టికెట్ను వెనక్కి ఇచ్చేయడం మహారాష్ట్రలో సంచలనంగా మారింది.
