జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలంలో విట్టంపేట గ్రామ శివారులోని వరద కాలువలో ఆదివారం గల్లంతైన వైద్యుడు ఉదయ్ కుమార్ రెడ్డి మృతదేహం లభ్యమయింది అని పోలీసులు తెలిపారు. గల్లంతయిన వైద్యుని మృతదేహం కోసం వెతుకుతున్న నేపథ్యంలో అదే గ్రామ శివారులో సోమవారం ఉదయం లేభ్యమైంది. ఉదయ్ కుమార్ రెడ్డి మెట్ పల్లి పట్టణంలోని యశోద హాస్పిటల్ లో వైద్యునిగా సేవలు అందిస్తున్నారు. ఆయన స్వస్థలం వరంగల్. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించారు.
