రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ లో చేరిన BRS ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. తన ముఖ్య అనుచరుడు గంగారెడ్డి హత్య జరిగిన నేపథ్యంలో ఆయన ఈ హాట్ కామెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్కు సంపూర్ణ మెజార్టీ ఉందని ఏ పార్టీ మద్దతు లేకుండా కూడా సుస్థిరంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో BRS ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వల్ల వారు చేరిన ప్రతి చోట ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు. పార్టీ విధానాలకు ఫిరాయింపులు వ్యతిరేకమని ఎవరైనా ఫిరాయిస్తే సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని అందుకు సంబంధించిన చట్టం కూడా ఉందని ఆయన అన్నారు
