27.7 C
Hyderabad
Saturday, August 1, 2026
No menu items!

10 మంది మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌

తెలంగాణ సామ్నా బ్యూరో: చత్తీస్‌ఘడ్‌, ఒడిషా రాష్ట్ర సరిహద్దుల్లోని గరియాబాద్‌ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో సిఆర్‌పిఎఫ్‌ బలగాలకు మావోయిస్టులకు మధ్యన జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు రాష్ట్ర పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ నుండి ఓ పత్రికా ప్రకటన విడుదల అయినట్టు తెలుస్తున్నది.
సోమవారం ఇద్దరు మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందగా అదే క్రమంలో కూబింగ్‌ చేస్తున్న భద్రతా బలగాలకు మావోయిస్టులకు భారీ స్థాయిలో ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు సమాచారం. ఈ ఆపరేషన్‌లో భారీ స్థాయిలో ఆయుధాలు, ఐఈడి, 1 ఎస్‌ఎల్‌ఆర్‌ స్వాధీనం చేసుకున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.
ఇందులో భాగంగా మంగళవారం వేకువజామున (21.01.2025) జరిగిన ఎదురు కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాలు సెర్చింగ్‌ ఆపరేషన్‌ను కంటిన్యూ చేస్తున్నట్లు సమాచారం. పోలీసులకు అందిన నమ్మకమైన సమాచారం మేరకు పెద్ద మొత్తంలో మావోయిస్టులు చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని కులారీఘాట్‌ రిజర్వు ఫారెస్ట్‌లో సమావేశం అవున్నతున్నట్లు తెలిసిన భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ ప్రాంతం ఒడిషా రాష్ట్రంలోని నూపాదా జిల్లా సరిహద్దుకు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో వుంది.
దీనితో ఇరురాష్ట్రాల పోలీసులు సమన్వయంతో ఒడిషాకు చెందిన ఎస్‌ఓజి, చత్తీస్‌ఘడ్‌కు చెందిన ఈ30, సిఆర్‌పిఎఫ్‌ పోలీసులను మోహరించి ఆపరేషన్‌ నిర్వహించినట్లు ఆ ప్రకటనలో తెలిపారు.
గత కొద్ది కొలంగా యుధ్ద వాతావరణం నెలకొన్న ఒడిషా, చత్తీస్‌ఘడ్‌, రాష్ట్రాల్లో తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌తో ఆయా రాష్ట్రాల అటవీ గ్రామ ప్రజలు బిక్కు బిక్కుమంటు ప్రజలు బ్రతుకీడ్చే పరిస్థితి వచ్చింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles