హెస్బుల్లా మరో కీలక సభ్యుడు జాఫర్ ఖాదర్ ఫార్ ను మట్టుపెట్టినట్టు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. ఇప్పటికే కీలక నేతలను హతమార్చిన ఇజ్రాయిల్ తాజాగా ఈ ప్రకటన చేసింది. బ్రిగేడు రాకెట్, మిస్సెస్ యూనిట్కు జాఫర్ ముఖ్య కమాండర్ గా ఉన్నట్లు ఐడిఎఫ్ తెలిపింది. గతంలో ఇజ్రాయిల్ పై చేసిన మిసైల్స్ దాడుల వెనుక ఇతనే ముఖ్య పాత్ర అని ఐడిఎఫ్ పేర్కొంది.
