ఈనెల 25వ తారీకు నుండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నట్లు సమాచారం. ఈనెల 25 నుండి డిసెంబర్ 20వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. అత్యంత ముఖ్యమైన బిల్లులు ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎన్ డి ఏ భాగస్వామ్యంలో అత్యంత క్లిష్టమైన రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం రాబోతున్న శీతాకాల సమావేశంలో ఏర్పడవచ్చు అని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని క్లిష్టమైన అత్యంత అవసరమైన బిల్లులను ప్రవేశపెట్టడానికి ఆలోచిస్తుందన్న వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాలు దేశంలో రాజకీయ వేడిని రగిలించడం మాత్రం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు
