35.1 C
Hyderabad
Sunday, June 21, 2026
No menu items!

జగిత్యాల జిల్లా ధార్మిక సెల్ కన్వీనర్ గా మాడవేని నరేష్

(బాలే అజయ్ -9290277727, కోరుట్ల)

భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా ఎండోమెంట్ (ధార్మిక) సెల్ కన్వీనర్‌గా మాడవేణి నరేష్‌ను నియమిస్తూ నియామక పత్రాన్ని జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ వై. అనూప్ రావు అందజేశారు. ఈ కార్యక్రమం డాక్టర్ అనూప్ రావు నివాసంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గో సంరక్షణ, దేవాలయాల పరిరక్షణ, హిందూ ఐక్యత కోసం మాడవేణి నరేష్ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ధర్మ పరిరక్షణ కోసం అంకితభావంతో పనిచేస్తున్న నరేష్‌కు ఈ బాధ్యతలు అప్పగించడం అభినందనీయమని పేర్కొన్నారు.

నియామకంపై మాడవేణి నరేష్ హర్షం వ్యక్తం చేస్తూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతం, ధార్మిక కార్యక్రమాల అభివృద్ధికి మరింత కృషి చేస్తానని అన్నారు.

కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శులు ఎర్ర రాజేందర్, చెట్లపల్లి సాగర్, మ్యాకల గణేష్, గందె నవీన్, సీనియర్ నాయకులు పోతుగంటి శ్రీనివాస్, ఎల్లాల నారాయణరెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, నెమురి విజయ్, గడ్డం రాజశేఖర్, కచ్చు రమేష్, బాల్క ప్రేమ్ సాగర్, తైదాల ప్రశాంత్, సంకు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles