32 C
Hyderabad
Friday, October 30, 2026
No menu items!

హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్ – రిమాండ్

(బాలే అజయ్ – కోరుట్ల)

సుమారు రెండు సంవత్సరా ల క్రితం కోరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్‌లో జరిగిన హత్యాయత్నం మరియు నేరపూరిత కుట్ర కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఠాకూర్ వినయ్ సింగ్ (31)ను కోరుట్ల పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అరెస్ట్ చేసినట్లు కోరుట్ల సిఐ కే. లక్ష్మీనారాయణ తెలిపాడు. వైద్య పరీక్షల అనంతరం న్యాయస్థానం ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం Cr.No.341/2024గా నమోదు చేయబడింది. 24-06-2024 రాత్రి గాంధీ రోడ్‌లో ఫిర్యాదుదారు పొగుల రాజేష్‌పై పాత కక్షల నేపథ్యంలో నిందితులు కలిసి పథకం ప్రకారం దాడి చేసి హత్య చేయడానికి ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఈ కేసులో ఇప్పటికే A-2 నుండి A-6 వరకు నిందితులను అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచనట్లు ఆయన తెలిపారు. అయితే ప్రధాన నిందితుడైన A-1 ఠాకూర్ వినయ్ సింగ్ అప్పటి నుండి పరారీలో ఉంటూ పోలీసుల అరెస్టును తప్పించు కొని తిరుగుతున్నాడు.

ఈ మేరకు తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు కోరుట్ల SI G. శ్యామ్ రాజ్ తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా వ్యవహరించి మంగళవారం తెల్లవారుజామున కోరుట్ల బస్‌స్టాండ్ వద్ద ఠాకూర్ వినయ్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విచారించగా కేసులో తన పాత్రకు సంబంధించి వివరాలు వెల్లడించాడు. పంచుల సమక్షంలో చట్టప్రకారం కాన్ఫెషన్ పంచనామా నిర్వహించినట్లు సిఐ తెలిపారు.

అనంతరం నిందితుడి అరెస్ట్‌కు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసి, కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, న్యాయస్థానం ముందు హాజరు పరిచినట్లు ఆయన తెలిపారు. నిందితుడిని 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు.
నిందితున్ని అరెస్ట్ కావడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐకే లక్ష్మీనారాయణ, ఎస్ఐశ్యామ్ రాజ్ లను జిల్లా ఎస్పీ అభినందించారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles