తూర్పు లాడ్డాకులోని వాస్తవ దీన రేఖ వెంబడి ఇరుదేశాలు గస్తీ ఉపసంహరణ విషయం కుదిరిన నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ స్ఫూర్తివంతమైన ప్రకటన చేశారు. ఈ ఒప్పందం కుదరడం వెనక భారత సైన్యం అత్యంత కష్టమైన క్లిష్టమైన పరిస్థితిలోనూ పట్టుదలతో నిలబడడం వల్లనే సాధ్యమైందని ఆయన అన్నారు. ఒప్పందం వెనుక భారత సైన్యమే తొలి కారణంగా చెప్పొచ్చు అని ఆయన అన్నారు. చైనా భారత్ సరిహద్దుల వెంబడి దశాబ్దాకాలంగా భారత్ చేస్తున్న మౌలిక వసతుల అభివృద్ధి కూడా రెండవ కారణమని ఆయన తెలిపారు.

