(బాలే అజయ్, కోరుట్ల: 9290277727)
డబ్బులు అడిగిన వ్యక్తిపై దాడి చేసినట్టుగా ఫిర్యాదు అందిందని కోరుట్ల ఎస్సై శ్యామ్ రాజు తెలిపారు. మండలం లోని సర్పరాజుపల్లి గ్రామానికి చెందిన కొక్కు రాజు (40) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సౌదీలో పనిచేసిన సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సింహాల మధు తనకు రూ.12 లక్షలు ఇవ్వాల్సి ఉందని, పలుమార్లు డబ్బులు అడిగినప్పటికీ మధు వాయిదా వేస్తూ వచ్చాడని తెలిపాడు.
ఈ క్రమంలో ఆదివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో సర్పరాజుపూర్ బస్టాండ్ వద్ద నుండి బైక్పై వెళ్తుండగా గణేష్(మధు కొడుకు), దిలీప్, రఘురాం, హరీష్ తదితరులు తనను అడ్డగించి దూషిస్తూ ముఖం, దవడపై కొట్టి, ఇకపై డబ్బులు అడిగితే చంపుతామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామనీ ఎస్సై తెలిపారు.
