(బాలే అజయ్ – 9290277727)
కోరుట్ల పట్టణంలో చేయూత పథకం ద్వారా పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ధృవీకరణ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు తెలిపారు. Face Recognition Software (FRS) ముఖ గుర్తింపు సాఫ్ట్‌వేర్‌తో పాటు బయోమెట్రిక్ వేలిముద్రల ద్వారా సురక్షితమైన ధృవీకరణ చేపట్టేందుకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు.
ఈ ప్రక్రియ మే 16, 2026 నుండి జూన్ 15, 2026 వరకు కొనసాగనున్నట్లు కోరుట్ల మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు.
లబ్ధిదారులు తమ వద్దకు వచ్చే వార్డు అధికారులకు సహకరించి ముఖ గుర్తింపు మరియు బయోమెట్రిక్ వేలిముద్రలు ఇవ్వాలని ఆయన కోరారు.
