
(బాలె అజయ్, తెలంగాణ సామ్నా)
కోరుట్ల పట్టణంలోని జవహార్ రోడ్‌లో ఉన్న శ్రీ వాసవి కళ్యాణ భవనం సంఘం ఆవరణలో సుదర్శన యాగ సహిత శ్రీవారి కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించబడింది.
ఈ మహోత్సవం జగద్గురువులు ఆది శంకరాచార్యులు హంపి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగింది. కార్యక్రమంలో బ్రహ్మశ్రీ శ్రీమాన్ శ్రీ శ్రీ తాళ్లపాక స్వామీజీ (హరి నారాయణ చార్యులు) తాళ్లపాక వంశస్థులు కన్యాదాతలుగా వ్యవహరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
పట్టణ పురోహితులు బ్రహ్మశ్రీ పాలెపు రామకృష్ణ శర్మ గారి వైదిక నిర్వహణలో శాస్త్రోక్తంగా, అంగరంగ వైభవంగా శ్రీ శ్రీనివాసుని కళ్యాణం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో కంకేర్య దాతలుగా
కట్కం జగదీశ్వర్, గోసికొండ కుమారస్వామి, మంచాల జగన్, రుద్ర సుధాకర్, బండి సురేష్, సిరిమల్లె రవి ప్రకాష్, భీమనాతి రమేష్, బెజ్జారపు శ్రీధర్, కర్నాల కిషోర్, నల్ల రతన్, అల్లే నరేంద్ర, నేమురి విజయ్, కట్కం శివ తదితరులు సేవలందించారు.
మహోత్సవంలో భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని, అనంతరం ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో స్వీకరించారు.
