కువైట్‌ను చూస్తే మినీ భారతదేశంలా వుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కువైట్ పర్యటనలో వున్న మోడీ ఓ సభలో
ప్రసంగిస్తూ ఆయన అలా అన్నారు. కువైట్ నేతలతో ఎప్పుడు మాట్లాడినా భారతీయుల గురించే వారు వివరిస్తారు అని అన్నారు.
విదేశంలో ఇంతమంది భారతీయులను కలవడం చాలా సంతోషంగా వుందని పేర్కోన్నారు.. విదేశీ మారక ద్రవ్యం సమకూర్చడంలో కువైట్ భారతీయులు అగ్రస్థానంలో వున్నారని అన్నారు. ఇదంతా భారతీయులంతా ఐక్యంగా కష్టపడడం వల్లే సాధ్యమైందని అన్నారు. భారత్ కువైట్ మధ్యన విడిదీయలేని మైత్రియే కాదు గొప్పనైన దౌత్య సంబంధాలతో ముడివడి వుందని ఆయన తెలిపారు.
