
తెలంగాణ సామ్నా: వారం రోజులు కూడా కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా మూడు విమాన ప్రమాదాలు జరగడం ప్రయాణికుల్లో అందోళన కలిగిస్తున్నది. కజకిస్థాన్ విమాన ప్రమాద ఘటన మరువక ముందే సౌత్ కొరియా విమాన ప్రమాదం గురించి తెలిసిన ప్రపంచం నిర్ఘాంతపోయింది. ఆ రెండు విమానల ప్రమాదాలకు సంబంధించిన ప్రాథమిక వివరాలు ప్రపంచానికి తెలియక ముందే మూడవ విమాన ప్రమాదం కెనడాలో జరిగింది. కెనడా ప్రమాదం చిన్నది గానే కనిపిస్తున్న ప్రయాణికుల భద్రత పట్ల ఆందోళన వ్యక్తం అవుతున్నది. దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తున్నది. రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధ వాతావరణం కలిగివుండడం కజకిస్థాన్ వుండడం కజకిస్థాన్ విమాన ప్రమాద కారణంగా భావిస్తున్నారు. మిగితా రెండు విమాన ప్రమాదాల్లో దక్షిణ కొరియా విమాన ప్రమాదం పక్షి ల్యాండిరగ్ గేర్‌ను తాకడం వల్ల జరిగిందని భావిస్తుండగా, కెనడా విమానం విరిగిన ల్యాండిరగ్ గేర్‌తో ల్యాండ్ అవుతున్న క్రమంలో మంటలు చేలరేగాయి. ప్రయాణికుల ప్రాణాలకు ఎలాంటి నష్టం జరుగుకున్నా, గడిచిన వారం రోజుల్లోనే మూడు విమాన ప్రమాదాలు జరగడంతో విమాన ప్రయాణం చేసేవారు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చెందుతున్నారు.
