
తెలంగాణ సామ్నా: ఈ సంఘటన జరిగిన జిల్లా పేరు వినివుంటారేమో! అలాగే ఇలాంటి సంఘటనలు గతంలో జరిగాయని చర్చించి వుంటారేమో! కాని ఇలాంటి సంఘటన జరిగింది అని తెలిసిన ప్రతిసారి సభ్య సమాజం సిగ్గుతో, అవమానంతో, బాధతో, మౌనంగా తలదించుకోవాల్సిందే. అలాంటి అమానవీయ ఘటన మహారాష్ట్రలోని పర్భనీ జిల్లాలో జరిగింది.
ఉత్తమ్కాలే అనే ప్రబుద్ధుడు (క్షమించాలి. మూర్ఖుడు అని అనాలేమో!) తన భార్య మూడవ సంతానం కూడా అడిపిల్లకే జన్మనిచ్చిందని పెట్రోల్ పోసి నిప్పంటించాడు. చుట్టుపక్కల వారు రక్షించాలని ప్రయత్నం చేసినా ఆ గృహిణిని కాపాడలేకపోయారు.
మహిళలు ఎన్నో రంగాల్లో తన ప్రతిభను చాటుకొని ముందుకు వెలుతుంటే, ఈ ప్రబుద్ధుడు చేసినా మూర్ఖపు పనికి యావత్తు సమాజం భర్తను చీదరించుకుంటున్నది. పోలీసులు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
