27.4 C
Hyderabad
Sunday, June 21, 2026
No menu items!

వాంగ్మూలం (దయచేసి తప్పక చదవండి)

(నిన్నటి తరువాయి)
ఈ రెండు ఆలోచనా విధానాలకు శాశ్వత వైరుధ్యముకొనసాగుతూ వుండినది. విప్లవకారులను ‘‘హింసా సంస్కృతి వాదులని’’ గాంధీ, కాంగ్రెస్‌ గర్హించుచుండినారు. గాంధీ బ్రిటష్‌ అధికారమును అంతమొందించుటకు అనుసరించవలసిన పద్ధతులలో, విధానాలలో పవితతను గూర్చి మాట్లాడేవారు. ఈ విధానాలలోని వైరుధ్యము, లోకమాన్య తిలక్‌ జీవించుయుండగా వెలిబుచ్చబడినది. భగవద్గీతను పరిశీలించుటలో గాంధీకి ప్రత్యేకమైన దృక్పథముండెడిది. ఇది తిలక్‌ దృక్పథముతో సరిపోయేది కాదు. ఒక మంచి కార్యసాధనలో హింస, కేవలం త్యాగము, లేక సన్యాసముతో కలిసి మెలసి మనజాలదనే విధమున తిలక్‌ చూచే వారు కాదు. అరవిందుని వలనే తిలక్‌ జాతిని మతము (ధర్మము)తో అబేధముగా చూచినాడు. నిష్కామకర్మను సాధించదలచిన వ్యక్తికి అహింస తప్పనిసరిjైున ప్రథమ సూత్రంగా గాంధీజీ గాఢముగా విశ్వసించినారు.
తిలక్‌, సావర్కరు ఒకే విధమైన భావములను కల్గిముండినారు. సావర్కర్‌ మార్గదర్శనము ప్రాచీన విజ్ఞానములోని ముఖ్యాంశములన నాధారముగా గొన్నప్పటికీ, ప్రస్తుత కాలానికి తగినట్టుగా యుండేడిది.
ఏ వ్యక్తిగాని పుపరాతన గ్రంథములలోని అరారతములుచే బంధింపబడరాదు. ప్రతి వ్యక్తి మార్పు చెందుతున్న కాలానుగుణంగా అనుగుణముగా వుండునాటిని స్వీకరించి అచరించవలెను. కాని ఏదైతే మానవజాతి పురోగతికి ఈనాడు ఆటంకముగ వున్నదో అది ప్రస్తుత కాలమునకు సరిపోదని, తిరస్కరించవలసినదేనని ఆయన ఉద్భోదించినారు. ఆయనకు హిందుస్థాన్‌ స్వాతంత్య్రమే మొదటి విధ్యుక్త ధర్మము, ప్రథమ కర్తవ్యము. పైకి హింసాత్మక చర్యలవలె కనిపించినప్పటికి, విప్లవకారుల ఉద్తాతమైన త్యాగాలను, ఆత్మార్పణ తత్పరతను ప్రజలు ఆరాధించే విధంగా ఆయన చేయగల్గినారు. గాంధీ విప్లవ వీరులకు, స్వాతంత్య్ర సాధనలో వారి హింసాత్మక సంస్కృతికి తన ముఖము తపించి తన అయిష్టలను అనేక మార్లు ప్రకటించుకొని యున్నారు.
సావర్కరు కొన్ని జాతీయ లక్ష్యములకై నిలిచినారు. జాతి క్షేమము దృష్ట్యా మాత్రమే ఆయన గాంధీ, కాంగ్రెస్‌ అనుసరించిన ముస్లిం సంతుష్టీకరణ విధానానన్ని తర్క సమ్మతముగా ఖండిరచినారు. కాంగ్రెస్‌ ప్రభుత్వముచే మార్గ దర్శనము చేయబడుచుండిన నేరారోపకులకు సావర్కరు హత్యానేరములో ఇరికించుట సులభముగానే వుండినది. ఆయనకునేరుగా నేరములో భాగస్థునిగా చేసినపుడు ఆయన ఉదోభదించిన లక్ష్యముల యథార్ద తత్వమును గూర్చి చర్చించకుండా వాటిని ఉద్ధేశ్యపూర్వకముగ వక్రీకరించి నేరారోపకులు తమకు అనుకూలముగా ఉపయోగించుకొనినారు. (తరువాయి 5.1.25 రోజున)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles