25.6 C
Hyderabad
Saturday, October 31, 2026
No menu items!

మైనర్ బాలికపై లైంగిక దాడి.. కోరుట్లలో కేసు నమోదు

(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)

షాపింగ్ మాల్‌లో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న 17 ఏళ్ల మైనర్ బాలికను పరిచయస్తుడైన వ్యక్తి బైక్‌పై తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో కోరుట్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్న బాలిక బుధవారం (ఆగస్టు 19) విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా, తనకు పరిచయమైన వ్యక్తి బైక్‌పై ఇంటి వద్ద దింపుతానని చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆమెను బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని కళ్లూర్ రోడ్డు వైపు తీసుకెళ్లినట్లు తెలిపారు.

అక్కడ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరించి బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో ఆరోపించారు. ఘటన అనంతరం బాలిక ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లికి చెప్పడంతో.. ఆమె కోరుట్ల పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలికి అవసరమైన వైద్య పరీక్షలు, ఇతర సహాయ చర్యలను చట్టప్రకారం చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

మైనర్ బాలిక గోప్యతను దృష్టిలో ఉంచుకుని బాధితురాలి వ్యక్తిగత వివరాలతో పాటు నిందితుడి గుర్తింపును పోలీసులు వెల్లడించలేదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles