(బాలే అజయ్ – 9290277727)
జగిత్యాల జిల్లా మేడిపల్లి జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మేడిపల్లి నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న TS21J 3612 నంబర్ గల కారు, అదే దిశలో ప్రయాణిస్తున్న ఏపీ 28 సిరీస్‌కు చెందిన స్ప్లెండర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి రెండు కాళ్లు విరిగినట్లు సమాచారం. వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.
ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
