31.2 C
Hyderabad
Wednesday, April 22, 2026
No menu items!

మిడ్రాండ్‌లో అనాథ పిల్లలకు దక్షిణాఫ్రికా సాయి దర్శన్ సంస్థ సాయం

(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా మరియు డి . శ్రీనివాస్, సౌత్ ఆఫ్రికా)

శ్రీ సాయి దర్శన్ చారిటబుల్ ఆర్గనైజేషన్, సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యంలో మిడ్రాండ్, జోహానెస్‌బర్గ్‌లో అనాథ పిల్లలకు దాతృత్వ సహాయం అందించారు. సంస్థ ప్రతినిధి అరుణ్ మాట్లాడుతూ, 2008లో స్థాపించబడిన తమ సంస్థ ఆధ్యాత్మిక మార్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు.
ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి కళ్యాణం, దసరా సందర్భంగా దేవి నవరాత్రులు నిర్వహించడమే కాకుండా, రెండు ప్రధాన చారిటబుల్ కార్యక్రమాలను కూడా చేపడుతున్నట్లు చెప్పారు. “మానవ సేవే మాధవ సేవ” అన్న నినాదంతో సమాజానికి తోచిన సహాయం అందించడమే తమ లక్ష్యమని వివరించారు.
అనాథ పిల్లల పరిస్థితి చూసి ఎంతో కలచివేసిందని, భగవంతుడు ఇచ్చిన శక్తితో వారికి ఆర్థిక సహాయంతో పాటు నైతిక బలాన్ని కూడా అందించాలని ముందుకు వచ్చామని పేర్కొన్నారు. పిల్లలందరూ తమ జీవిత లక్ష్యాలను సాధించాలని, వారి కలలు నెరవేరాలని సాయి దర్శన్ సంస్థ తరఫున ఆకాంక్షించారు.
ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని, ముఖ్యంగా శ్రీరామ నవమి అనంతరం మరిన్ని చారిటబుల్ ఈవెంట్లు నిర్వహించాలని సంకల్పించినట్లు తెలిపారు.
కార్యక్రమం చివరలో “ఓం సాయిరామ్” అంటూ సంస్థ సభ్యులు సేవా భావాన్ని వ్యక్తపరిచారు.
ఇట్టి కార్యక్రమంలో సంకు అరుణ్, దుడుక శ్రీనివాస్, రాజేష్, హరీష్, అశ్విని, భూమిక, భాస్కర్, లక్ష్మి, ఎస్. శ్రీనివాస్, ప్రియా, ఘిరువాని, భావ్య, ననికా, నిర్మల్, శ్రీధర్, రోనిత్ సాయి, యశస్విని, లావణ్య, సుబ్బారావు, శ్రీహాన్, సన్విక తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles