(నిన్నటి తరువాయి)
స్వాతంత్రోద్యమము 1914 లో గాంధీజీ రంగప్రవేశముతో ప్రారంభమైనదని, జాతిపిత నాయకత్వములో ఏ రోజునైతే స్వాతంత్య్రము సాధించబడినదని చెప్పబడుతున్నదో ఆ 1947 ఆగస్టు 15వ తేదీకి స్వాతంత్య్ర సాధన సంపూర్ణమైనదని చాల ఎక్కువమందే ఒక భ్రమలో మునిగితేలుతున్నారు. గత వేయి సంత్సరములకు పైగా నయ వంచకులచే పెంచబడి ఆమాయకులచే నమ్మబడిన ఈ బ్రహ్మండమైన కల్పితగాథ కంటె మించిన అసృతము చరిత్రలో ఇంకెప్పుడు వుండి యుండలేదు.తన నాయకత్వములో గాంధీజీ స్వాతంత్య్రము సాధించుటకు బడులు భారఃతదేశాన్ని విభజించి వేయి గాయములనుండి రక్తము స్రవించునట్లు చేసినాడు. భారతదేశములో స్వాతంత్రోద్యమము ఎప్పుడు జీవశక్తితో విజృంభిస్తూ వుండినదేగాని ఏనాడు అణగారిపోలేదు.
1918లో మహారాష్ట్ర సామ్రాజ్యము ఇక లేవ లేకుండా అణచవేయబడిఒనదని బ్రిటిష్ వారు భావించినప్పుడు స్వాతంత్ర శక్తులు బారతదేశములో కొంత భాగములో తలవంచి అదనుకై నిరీక్షిస్తుండినవి. కాని ఉత్తర భారతంలో శిఖ్కుశక్తి విజృంభన ద్వారా బ్రిటిష్ అధిపత్యమును ధిక్కరించుచునే యుండినది. 1848లో శిఖ్కులు గుజరాత్లో ఓడిరపబడినప్పుడు 1857 తిరుగుబాటుకు సంఘటనా కార్యక్రమములు అతి చురుకుగా సాగిపోవుచుండినవి. అది ఎంతవేగముతో శక్తితో దేశ విశాల ప్రాంతములలో చొచ్చుకొనినదంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వణకిపోయి భారతదేశమును వదలి వెల్లిపోవుట మంచిదేమో అని పలుమార్లు తీవ్రముగా ఆలోచించినారు. తన మెడపై పడిన ఈ బ్రిటిష్ గుదిబండను తోసివేయుటకు భారత ప్రజలు చేసిన ఈ పెద్ద ప్రయత్నమును గూర్చి కంటికి కట్టునట్లు వీర సావర్కరు తన ‘‘1857 భారత స్వాతంత్య్ర సమరము’’లో వర్ణించినారు. ఈ దెబ్బనుండి నిలద్రొక్కుకొని బ్రిటిష్ వారు తమ అధికారమును మరల స్థాపించుకొనునప్పటికీ, వారి అధికార ప్రాబల్యమును మరియొకసారి అద:కరించుటకు భారత జాతీయ కాంగ్రెసు స్థాపన జరిగినది. మరల 1885 నుండి స్వాతంత్య్రమునకై జాతీయ కాంక్ష మొదట రాజ్యాంగబద్దముగను తార్వత తీవ్రవాద రూపముగను సుస్థాపనము చేసుకొన్నది. ఈ తావ్రవాదము మరల ఆయుధపోరాటముగా వృద్ధి చెంది 1906లో ఖుదీరాంబోస్ బాంబుతో బహిరంగమైన రూపమును సంతరించుకొన్నది.
గాంధీజీ 1914`15 లో భారతదేశమునకు వచ్చినాడు. దానికి దాదాపు ఎనిమిది సంవత్సరములకు ముందే విప్లవొద్యమము భారతదేశములోని వివిధ ప్రాంతముకు విస్తరించినది. స్వాతంత్య్రోద్యమము ఏనాడు నిర్జీవము కాలేదు. కథలలో చెప్పబడు ఈజిప్టు ఫోనిక్సు పక్షివలె, తన అస్తికావశేషముల నుండి ద్విగునీకృతమైన శక్తితో లేచినది. గాంధీజీ ఆయన సత్మయు అహింసలు అనే వెఱ్ఱి భ్రమల ప్రవేశంతో
ఉద్యమానికి కొంత గ్రహణం పట్టింది. సుభాష్ చంద్రబోస్, మహారాష్ట్ర, పంజాబు, బెంగాలులోని విప్లవకారుల చలువ వలన తోకమాన్య తిలక్ మరణానంతరం గాంధీజీ నాయకత్వ అధిరోహణకు సమాంతరంగా ఉద్యమము వృద్ధి చెందుతూనే వుండినది.
(మిగతా రేపు)
