28.6 C
Hyderabad
Sunday, June 21, 2026
No menu items!

త్వరలో కేసిఆర్‌ అమెరికా వెళుతున్నాడా?

FILE: Telangana Chief Minister K. Chandrasekhar Rao

తెలంగాణ సామ్న బ్యూరో: ఓ వారం రోజుల్లో కేసిఆర్‌ అమెరికా వెలుతున్నట్లు గుసగుసల వార్తలు గుప్పుమంటున్నాయి. ఇందులో వాస్తవం, ఆవాస్తవం అనే వాదనను గనక ఆలోచిస్తే… తన ఆరోగ్య కారణాలు చూపి కేసిఆర్‌ అమెరికా వెళతారని కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నెలాఖరులో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల కోసం కమిషన్‌ విచారణకు పిలవనున్న నేపథ్యంలో కేసిఆర్‌ అమెరికా వెలుతున్నారన్న ప్రచారం రావడం ప్రత్యేకత సంతరించుకుంది. దీనికి తోడు కేటిఆర్‌ హైకోర్టులో వేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేసిన నేపథ్యంలో రాజకీయాలు వేడిగా మారి సంఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్న క్లిష్ట సమయంలో కేసిఆర్‌ అమెరికా పర్యటన అంటూ ప్రచారం రావడం అనేది ప్రత్యర్థి పార్టీల ‘‘మైండ్‌ గేమ్‌’’లో భాగమేనని కొందరు కార్యకర్తలు చెబుతున్నారు. పూలమ్మిన చోటే కట్టెలు అమ్మే పరిస్థితి లాంటి ఇబ్బందికర రాజకీయాల వల్లే కేసిఆర్‌ కలత చెంది అమెరికా వెళుతున్నారేమో! అని అందరు చెబుతుంటే ఆరోగ్య పరీక్షలకు వెళ్లే అవకాశం వుందని మరికొందరు వాఖ్యానిస్తున్నారు.

అయితే పార్టీ ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో వున్న నేపథ్యంలో కేసిఆర్‌ అమెరికా వెలుతున్నారన్న ప్రచారం కేవలం బారాసను ప్రజలను తక్కువ చేసి చూపడానికి ప్రత్యర్థులు చేసే ప్రచార కుట్రగానే చాలా మంది చెబుతున్నారు. అసలు కొసరు విషయం ఏలాగున్నా… కేసిఆర్‌ అమెరికా వెలుతున్నారన్న ప్రచారం మటుకు చలికాలంలోను చెవులు కొరుక్కు పోయేంత గొప్పగా చేరుకుంటుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles