
తెలంగాణ సామ్నా: డిసెంబర్ 31 మంగళవారం రాత్రి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలనుకునే వారు తగు జాగ్రత్తలు పాటించాలని కోరుట్ల సిఐ సురేష్‌బాబు తెలిపారు. ఈ మేరకు స్థానికి మీడియాకు వీడియో సందేశం పంపారు.
శాంతభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్ట ప్ర్రకారం తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
కోరుట్ల, మేడిపల్లి, మరియు కథలాపూర్ మండల ప్రజలకు ముఖ్యంగా యువకులు కొందరు 31 డిసెంబర్ రాత్రి మద్యం సేవించి రోడ్లపై విచ్చిలవిడిగా వాహనాలపై తిరుగుతున్నుట్లు సమాచారం వస్తుంది. దీని వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలగడమే కాకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి ఎంత తీవ్ర నష్టమో ఆలోచించాలని ఆయన కోరారు. అందుకని ప్రజలు ఎవరికి ఇబ్బంది కలగని రీతిలో 31 డిసెంబర్ జరుపుకోవాలని కాని ఇతరులకు ఇబ్బంది కలిగించి వారు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు తెచ్చుకోవద్దని ఆయన సర్కిల్ ప్రజలకు సూచించారు. అలాగే 31 డిసెంబర్ నాడు తాము కూడా డ్రంకన్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహిస్తామని నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని ఆయన తెలిపారు.
