27.7 C
Hyderabad
Wednesday, April 22, 2026
No menu items!

జగిత్యాలలో యువకుడి దారుణ హత్య

(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా,జగిత్యాల)

పట్టణ పరిధిలో ఆదివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. జగిత్యాల మండలం పోరండ్ల గ్రామానికి చెందిన ‘బోరే విశ్వనాథ్’ అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పట్టణంలోని బైపాస్ రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. వ్యక్తిగత కక్షలే హత్యకు కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, అసలు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించే దిశగా పలు కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిసింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles