31.2 C
Hyderabad
Wednesday, April 22, 2026
No menu items!

కోరుట్లలో బీజేపీ నిరసన: గడి బురుజులు, అక్రమ భూములపై చర్యలకు డిమాండ్*

(బాలే అజయ్ – 9290277727)

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మున్సిపల్ సమావేశానికి ముందు భారతీయ జనతా పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు, 11వ వార్డు కౌన్సిలర్ కస్తూరి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గడి బురుజులు సహా పట్టణ చారిత్రక కట్టడాలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.
అదే సమయంలో, పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో సుమారు 5,000 గజాల భూమిపై అక్రమంగా హౌస్ నంబర్ (6-1-63) కేటాయించారని ఆరోపిస్తూ, దాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. అనుమతులు లేకుండా భూమిని వీఎల్టీ చేసి, హౌస్ నంబర్ కేటాయించి అక్రమార్కులకు అప్పగించడంలో మున్సిపల్ కమిషనర్‌తో పాటు సంబంధిత సిబ్బంది ప్రమేయం ఉందని ఆరోపించారు.
ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, కోరుట్ల పట్టణ ప్రజల పక్షాన బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడిన అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కూడా బీజేపీ కౌన్సిలర్లు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, గడి బురుజులు మరియు గ్రామ కంఠ ఆబాది పరిధిలోని ఖాళీ భూములను రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను, మున్సిపల్ చైర్మన్‌ను కోరారు.
ఈ సమస్యలపై అధికారులు, అధికార పార్టీ నాయకులు స్పందించకపోవడం దురదృష్టకరమని బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles