హైదరాబాదులోని రాయదుర్గంలో ఉన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఇంటి వద్ద ఉద్రిక్తతనెలకొంది. ఆయన ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. వీరిని పలువురు బిఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్న క్రమం ఏర్పడింది .ఈ నేపథ్యంలో శాసనసభ్యుడు వివేకానంద ను మాజీ శాసనసభ్యుడు బాల్క సుమన్ తో సహా పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని అరెస్టు చేసే క్రమంలో పోలీసులు బిఆర్ఎస్ నేతల మధ్యన తోపులాట చోటు చేసుకుంది.
