జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా చెప్పుకుంటున్నా రేవ్ పార్టీపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఈ విషయంపై తెలంగాణ డిజిపి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు ఫుటేజ్ లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆ సీసీ ఫుటేజ్ లన్నీ ఎడిటింగ్ అయ్యే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. కేటీఆర్ రేవంత్ ఒక్కటి అవునా కాదా ఈ విషయంలో తేలిపోతుందని ఆయన అన్నారు. ఒకవేళ వారిద్దరూ ఒక్కటి కాకపోతే ఫామ్ హౌస్ లో ఏం జరిగిందో సమాజానికి చెప్పాలని ఆయన అన్నారు. మేం చెబితే మాకు యువరాజు నోటీసులు మళ్లీ ఇస్తాడేమో అందుకే ఆ పార్టీ రాజుధా? యువరాజుదా? రేవ్ పార్టీనా? రావులపార్టీనా? అనేది బయటపడాలని ఆయన అన్నారు.

