
(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
కోరుట్ల పట్టణానికి చెందిన ఆదర్శ విద్యాలయం ఉన్నత పాఠశాల 2007–08 బ్యాచ్ పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం స్థానిక రారాజు ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. 17 సంవత్సరాల అనంతరం మళ్లీ కలుసుకున్న బాల్య మిత్రులంతా చిన్ననాటి మధుర జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకుంటూ ఆనందంలో మునిగిపోయారు.
పాఠశాల రోజుల్లోని మరపురాని అనుభవాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ప్రత్యేకంగా ఆహ్వానించి గౌరవపూర్వకంగా సత్కరించారు.
అలాగే పాఠశాల కరస్పాండెంట్ స్వర్గీయ అల్లె సంగయ్య గారి చిత్రపటానికి నివాళులర్పించి, ఆయనతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో గురువులు తత్వాది రాజేంద్రప్రసాద్, కటుకం మహదేవ్, అల్లె సతీష్, కటుకం రమేష్, కటుకం ప్రసాద్, భోగ నవీన్, గరికంటి నరేష్, గన్నారపు విజ్డమ్, మాసం మధుసూదన్, మిట్టపల్లి గంగకృష్ణ, ఆడెపు శిరీష్, మాడిశెట్టి సౌజన్య, ఎక్కల్దేవి కన్నాంబ, మామిడిపెల్లి రాధ తదితరులు పాల్గొన్నారు.
(దేశభక్తి, దైవ భక్తి, సమకాలీన రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవారికి రిపోర్టర్లుగా స్వాగతం.)
సంప్రదించండి:
“బాలె అజయ్” – 9290277727
