
(నిన్నటి తరువాయి)
మిగతా ముద్దాయిలు దేశవిభజనను, ప్రజలచే హానికరమైన తర్కాన్ని మింగేటట్టు చేసే నియంతృత్వ ధోరణులను వ్యతిరేకించుటలో నిగ్గు తేలినవారు. వీర సావర్కరుకు దృఢమైన అనుచరులైన ఆ నిందితులుఆ విషయమును అణుమాత్రము కూడా నిరాకరించలేదు. అదే విధముగా వీరసావర్కరు కూడా కుట్రదారులుతన అనుయాయులు అను విషయము కాదనలేదు. దీనివలన కూడా మహాత్మా హత్య సావకర్కరు ఆశీర్వాదములతో జరిగినదని అస్పష్టమైన, ఊహాజనితమైన వినికిడి మాటలపై ఆధారపడి తమ కథను నిర్మించుకొనుటకు నేరారోపకులకు వీలు కలిగినది.
నిజానికి ఇది ఒక విధి వైచిత్రము. ఎవరైతే దేశవిభజన ద్వారా లక్షలాది ప్రజల సర్వనాశనానికి, మారణహోమానికి బాధ్యులైనందును ప్రజావ్యతిరేక నేరములకు గాను నేరస్థులుగా నిలడవలసి యన్నారో, వారు అధికారము చేజిక్కించుకొని అకళంక దేశభక్తుని నేరస్థుడుగా న్యాయస్థానములో నిలబెట్టినారు.
రెండవ ముద్దాయి, నారాయణ ఆప్టే, బి.ఎస్సీ,టి.బి. అందరి అభిమానము పొందిన ఉపాధ్యాయుడు, ఆయన ప్రత్యేకమై తరగతులను కూడా నడుపుతూ ఉండేవారు. ఆయన మూడవ మాద్దాయి నివసించుచుండిన పూణేకు 70 మైళ్ల దూరములోని జిల్లా ప్రధాన పట్టణమైన నగర్లో నివసిస్తూ వుండేవారు. వారిద్ధరికి అభిమాన పాత్రమైన కార్యకలాపాల వలన హిందూ సంఘటన. హిందువులను సమీకృతము చేయుటలో ఒకరికొకరు పరిచjైునారు. యువకులకు తుపాకులను ఉపయోగించుటలో నేర్పరులుగా చేయుటకు ఆప్టే ఒక రైఫిల్ క్లబ్ స్ధాపించినారు.
అటుతర్వాత కొంత కాలమునకు 1944లో హిందు సంఘటన లక్షఫ్యాన్ని ప్రచారము చేయుటకు ఆప్టే, నాధూరామ్ పసంయుక్తముగా ‘‘హిందూరాష్ట్ర’’ అనే మరాఠీ దినపత్రికను ప్రారంభించినారు. 1948 జనవరి 31తేదీన వచ్చిన ఈ దినపత్రిక ఆఖరు సంచిక గాంధీ హత్యా వార్తను ప్రచురించి, సంపాదకుడైన నాథూరామ్ గొడ్సె హత్య చేసిన వాని పేరుగా వ్రాసినది.
