కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజు శుక్రవారం మరణించారు. గుస్సాడీ నృత్యంలో ఆయన చేసిన సేవలను గుర్తించి 2021లో కేంద్రం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. గత కొన్ని రోజులుగా ఆరోగ్యంతో బాధపడుతున్న కనకరాజు ఈరోజు మరణించడంతో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. శనివారం మధ్యాహ్నం కనకరాజు స్వగ్రామమైన మార్లవాయిలో అంత్యక్రియలు జరగనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపుగా 55 ఏళ్ల పాటు ఆయన గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించారు.
