26.3 C
Hyderabad
Thursday, August 6, 2026
No menu items!

గడి మైసమ్మ తల్లికి బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల సమర్పణ

(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)

కోరుట్ల పట్టణంలోని గడిబురుజుల వద్ద గల శ్రీ గడి మైసమ్మ తల్లికి భారతీయ జనతా పార్టీ ఎండోమెంట్ (ధార్మిక) సెల్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం భక్తిశ్రద్ధలతో బోనాల సమర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాట పిల్లలతో అమ్మవారికి శాంతి నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాల ప్రతినిధులు, మహిళలు, వార్డు సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు.

ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా బీజేపీ ఎండోమెంట్ (ధార్మిక) సెల్ జిల్లా కన్వీనర్ మాడవేణి నరేష్ మాట్లాడుతూ, సమాజంలో ఐక్యత, సామరస్యం పెంపొందించే సాంప్రదాయ ఉత్సవాలకు భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్వప్న, పూర్ణిమ చౌదరి, కోరుట్ల పట్టణ బీజేపీ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కార్యదర్శి సుదవేని మహేష్, వివిధ కుల సంఘాల సభ్యులు, బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles