35.2 C
Hyderabad
Monday, April 20, 2026
No menu items!

కోరుట్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై ఆకస్మిక తనిఖీలు

(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)

కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్ ఆదేశాల మేరకు పట్టణంలో చికెన్ సెంటర్లు, కిరాణా దుకాణాలు, టిఫిన్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో వినియోగిస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను స్వాధీనం చేసుకుని రూ.4,600/- జరిమానాలు విధించారు. అదే సమయంలో బట్ట సంచుల వినియోగంపై అవగాహన కల్పించారు.
అలాగే ట్రేడ్ లైసెన్స్ రీన్యువల్ చేయని దుకాణదారులకు లైసెన్స్ రీన్యువల్ చేయించి రూ.5,944/- ఫీజు వసూలు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిస్థాయిలో నిషేధించాల్సిందేనని, నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధించడమే కాకుండా దుకాణాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ట్రేడ్ లైసెన్స్ లేని వారు వెంటనే లైసెన్స్ తీసుకోవాలని సూచించారు. వ్యాపార కార్యకలాపాల వల్ల ఉత్పత్తయ్యే చెత్తను తడి, పొడి, హానికర చెత్తగా వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలన్నారు. లేకపోతే ఎస్.డబ్ల్యూ.ఎమ్–2019 చట్టం ప్రకారం జరిమానా విధిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్లు రాజేంద్రప్రసాద్, ఇన్‌చార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, రికార్డ్ అసిస్టెంట్ జగదీష్, జవాన్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles