25 C
Hyderabad
Saturday, October 31, 2026
No menu items!

కోరుట్లలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం..చేనేత కార్మికులకు సన్మానం

(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కోరుట్ల పట్టణంలో తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దీపారాణి-ధనుంజయ్ ఆధ్వర్యంలో చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు.

కార్యక్రమానికి ముందు స్థానిక చేనేత సహకార సంఘం అధ్యక్షుడు గోనె శంకర్ చేనేత పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం చేనేత రంగానికి విశిష్ట సేవలు అందించిన ఎంబేరి భూమేశ్వర్, అందే వెంకటి, కటుకం రాజగంగారం, దాసరి దేవయ్య, గొడ్డుబర్ల జనార్ధన్, అల్లె శంకరయ్య (ముంబై), మ్యాకల రాజయ్య, ఎక్కలదేవి సురేందర్, చింతకింది శ్రీరాములు, కటుకం నారాయణలను శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేత పరిశ్రమ ప్రతీకగా నిలుస్తోందని, చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. చేనేత రంగాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుంటుక ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, శ్రీ శివమార్కండేయ కోటినవదుర్గ దేవాలయ చైర్మన్ జిల్లా ధనుంజయ్, పద్మశాలి సంఘ నాయకులు గడ్డం మధు, ఎంబేరి నాగభూషణం, అడెపు మధు, జిందం లక్ష్మీనారాయణ, మిట్టపల్లి శ్రీనివాస్ (ముంబై), పెండెం గణేష్, కట్కం జగదీశ్వర్, చింతకింది భూమానందం, అడెపు నరేష్ కుమార్, పద్మశాలి సంఘ ఉపాధ్యక్షుడు కటుకం వినయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి బండ్ల రవి కుమార్, పద్మశాలి యువత అధ్యక్షుడు జక్కుల ప్రవీణ్ కుమార్, వయోవృద్ధుల సంఘ నాయకులు ఎక్కలదేవి గంగాధర్, సిరిపురం గంగాధర్, కటుకం రమేష్, రాడం అశోక్, సిరిపురం రాజేశ్వర్, భీమనాతి రాజేశ్వర్, గూడూరు చంద్రకాంత్, అల్లె లక్ష్మీనారాయణ, మాసం శంకర్, మహిళా నాయకులు మచ్చ కవిత, గడ్డం సంజీవరాణితో పాటు పలువురు చేనేత కార్మికులు, పద్మశాలి సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles