
అర్బన్ కాలనీలో నీటి సమస్యకు పరిష్కారం
(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
పట్టణంలోని 7వ వార్డు అర్బన్ కాలనీలో ఎన్నో ఏళ్లుగా వేసవి కాలంలో నీటి ఎద్దడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సుమారు 15 నుంచి 20 కుటుంబాల సమస్యకు పరిష్కారం లభించింది. స్థానికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వార్డు కౌన్సిలర్ గూగుల్ శ్రీకాంత్, గుద్దేటి రాజేందర్ చొరవతో మోటార్‌ను ఏర్పాటు చేశారు.
మున్సిపల్ కమిషనర్, డీఈ సహకారంతో మోటార్‌ను బిగించి, వార్డు ప్రజల సమక్షంలో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. దీంతో ఎన్నో ఏళ్లుగా నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు వేసవిలో నీటి ఇబ్బందులు తగ్గనున్నాయి.
ఈ సందర్భంగా వార్డు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ కౌన్సిలర్ గూగుల్ శ్రీకాంత్, గుద్దేటి రాజేందర్‌లకు మిఠాయిలు తినిపించి కృతజ్ఞతలు తెలిపారు. స్థానికుల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసిన వీరికి వార్డు ప్రజలు అభినందనలు తెలిపారు.
