
తెలంగాణ సామా, డిల్లీ మాజీ సిఏం అరవింద్ కేజ్రీవాల్‌ను డిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారించడనికి డిల్లీ లెఫ్టినెంట్ జనరల్
శనివారం అనుమతి ఇచ్చారు. ఈ కేసులో డిసెంబర్ 5న కేజ్రివాల్‌ను విచారించేందుకు ఈడి అనుమతి కోరగా ఎల్జి అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఎల్జి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే, మార్చి 21నీడి కేజ్రివాల్‌ను లిక్కర్ కేసులో అరెస్ట్ చేసింది. ఆ తరువాత పార్లమెంట్
ఎన్నికల నేపథ్యంలో మే 10 నుండి జూన్ ఒకటవ తారీఖు వరకు కోర్టు బెయిల్ మంజూరీ చేసింది. ఆ తరువాత జూన్ 20న కేజ్రివాల్‌కు బెయిల్ వచ్చింది. దీనిని ఈడి సవాల్ప చేయడంతోప జూన్ 25న బెయిల్‌పై కోర్టు స్టే ఇచ్చింది.
ఆ తరువాత జూన్ 26న సిబిఐ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. ఈడి కేసులో బెయిల్‌పై వున్నప్పటికి సిబిఐ అరెస్ట్ చేయడంతో మళ్లీ జైలుకు వెళ్లాల్లి వచ్చింది. చివరకు సెప్టెంబర్ 13న సుప్రింకోర్టు సిబిఐ కేసులో బెయిల్ ముంజూరు చేసింది. దీనితో దాదాఉ ఆరు నెలల జైలు జీవితానికి తెరపడిరది. అయితే ఈ కేసులోనే ఈడి మరోసారి కేజ్రీవాల్‌ను విచారించేందుకు సిద్ధమవడంతో
డిల్లీ ఎల్జి అనుమతి ఇచ్చారు.
