
తెలంగాణ సామ్నా: దేశాన్ని శాసించే రోజులు కేసిఆర్‌కు కూడా వస్తాయని కేటిఆర్ తన ఆశాభావాన్ని వ్యక్త పరిచారు. 2023లో అతివిశ్వాసం వల్ల ఓడిపోయామని ఆయన అన్నారు. ఆ అతి విశ్వాసము వల్ల కాంగ్రెస్‌కు విపరీతమైన లాభం జరిగినట్లుగా ఆయన చెప్పుకోచ్చారు. 2023 పార్లమెంట్ ఎన్నికల్లో ఎర్పడిన సందిగ్దంలాంటి విచిత్ర రాజకీయ పరిస్థితి వల్ల కాంగ్రెస్,బీజేపి చేరి ఎనిమిది సీట్లు గెలుచుకున్నాయని ఆయన అన్నారు. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితి చూస్తుంటే భవిష్యత్తులో కేసిఆర్ కూడా బీహర్ నితిష్ కమార్, ఏపి చంద్రబాబు లాగా దేశాన్ని శాసించే రోజులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీల హవా నడిచే అవకాశం వుండే అవకాశం వుందని గతంలో కేటిఆర్ అన్న సంగత విదితమే.
