(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
పురపాలక ఎన్నికల నేపథ్యంలో కోరుట్ల పట్టణంలోని 33 వార్డులకు రిజర్వేషన్ ఖరారు చేయడంపై తీవ్ర వివాదం చెలరేగింది. కొన్ని వార్డులకు అన్యాయం జరిగిందంటూ 7వ వార్డుకు చెందిన గుద్దేటి రాజేందర్ మంగళవారం అర్బన్ కాలనీలో మీడియా సమావేశం నిర్వహించి వార్డు రిజర్వేషన్ పై స్పందించండి అని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– కోరుట్ల పట్టణంలోని
8వ వార్డులో 303 మంది ఎస్టీ ఓటర్లు,
12వ వార్డులో 186 మంది ఎస్టీ ఓటర్లు,
23వ వార్డులో 96 మంది ఎస్టీ ఓటర్లు ఉన్నప్పటికీ,
ఆ వార్డులకు జనరల్ రిజర్వేషన్ కేటాయించారని తెలిపారు.
అయితే, కేవలం 57 మంది ఎస్టీ ఓటర్లు మాత్రమే ఉన్న 7వ వార్డుకు ఎస్టీ రిజర్వేషన్ కేటాయించడం వెనుక ఉన్న నిబంధనలు, ప్రమాణాలు ఏమిటో స్పష్టంగా వివరించాగలరని, ఈ నిర్ణయం వల్ల బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతోందని గుద్దేటి రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్టీ సోదరులతో నాకు ఎలాంటి విభేదాలు లేవని. రాజ్యాంగబద్ధంగా, నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు కేటాయిస్తే మేము మనస్పూర్తిగా స్వాగతిస్తామని. రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం ఈ రిజర్వేషన్ ఎలా ఖరారైంది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ముందుంచాలి అని కోరారు.
ఈ మీడియా సమావేశంలో గుద్దేటి రాజేందర్‌తో పాటు అర్బన్ కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

